కేంద్ర మంత్రివర్గంలో స్వల్ప మార్పులు..స్మృతి ఇరానీకి మళ్లీ షాక్!
- May 15, 2018
దిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో సోమవారం రాత్రి స్వల్ప మార్పులు చేశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ రోజు దిల్లీలోని ఎయిమ్స్‌లో కిడ్నీ శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆయన బాధ్యతల్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగిస్తూ ప్రధాని మోదీ నిర్ణయించారు. జైట్లీ కోలుకొనే వరకు ఇంఛార్జిగా ఆర్థిక శాఖ బాధ్యతల్ని పీయూష్‌గోయల్ పర్యవేక్షించనున్నారు. అలాగే సమాచార, ప్రసారాల శాఖ నుంచి స్మృతి ఇరానీని తప్పించారు. ఆ శాఖను రాజ్యవర్థన్‌సింగ్ రాఠోర్‌కు అప్పగించారు. స్మృతి ఇరానీని జౌళి శాఖ మంత్రిగానే కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి పదవి నుంచి ఆల్ఫోన్స్ కన్నథానమ్‌ను తప్పించిన ప్రధాని.. ఎలక్ట్రానిక్స్ శాఖను ఎస్ఎస్ అహ్లూవాలియాకు అప్పగించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







