'నా నువ్వే' ట్రైలర్ విడుదల
- May 15, 2018
హైదరాబాద్: నందమూరి కల్యాణ్‌రామ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'నా నువ్వే'. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రం ఇది. జయేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా..ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. సాధారణంగా ప్రేమ కథల్లో హీరో అమ్మాయి కోసం పరితపిస్తుంటాడు. కానీ ఇందులో తమన్నా..కల్యాణ్ రామ్ ప్రేమ కోసం తపించడాన్ని ట్రైలర్‌లో అందంగా చూపించారు. ప్రేమ, యాక్షన్, కామెడీ ప్రధానంగా సాగే చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు.
'తపించే క్షణాలకు..నిరాశే చూపించకు..నా నువ్వే' అంటూ వచ్చే సంగీతం ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో.. కల్యాణ్ రామ్ వేరే ప్రదేశానికి వెళుతుంటే..'వెళ్లండి..కలుద్దాం' అని తమన్నా అంటుంది. ఇందుకు పక్కనే ఉన్న వెన్నెల కిశోర్..'ఇదేం ట్విస్ట్ బావా..జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉంది' అనడం నవ్వులు పూయిస్తోంది.
ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు పి.సి శ్రీరామ్ కెమెరా పనితనం, షరత్ సంగీతం ఆకర్షణీంగా ఉన్నాయి. కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. మే నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







