బీచ్‌కి దగ్గర్లో జెట్‌ స్కి: 2,000 దిర్హామ్‌ల జరీమానా

- May 21, 2018 , by Maagulf
బీచ్‌కి దగ్గర్లో జెట్‌ స్కి: 2,000 దిర్హామ్‌ల జరీమానా

అబుదాబీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, బీచ్‌ గోయర్స్‌కి జెట్‌ స్కీల వినియోగంపై తాజాగా కొన్ని సూచనలు చేసింది. పర్సనల్‌ వాటర్‌ క్రాఫ్ట్‌లను హైర్‌ చేసుకోవడం, వాడటం, లైసెన్సింగ్‌కి సంబంధించి ఈ సూచనలు చేయడం జరిగింది. జెట్‌ స్కీలను బీచ్‌ నుంచి 200 మీటర్ల లోపు వినియోగిస్తే, వారిపై జరీమానా విధించడం జరుగుతుందని ఆ సూచనలో పేర్కొన్నారు. మొదటగా 500 దిర్హామ్‌లు జరీమానా విధించబడుతుందనీ, రెండోసారి 1,000 మూడోసారి 2,000 జరీమానా ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది అబుదాబీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌. మూడో పెనాల్టీతోపాటు జెట్‌స్కిని నెల రోజులపాటు ఇంపౌండ్‌ చేసే అవకాశముంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com