యు.ఏ.ఈ నుండి ఇండియా వెళ్ళే వారికి హెచ్చరిక

- May 21, 2018 , by Maagulf
యు.ఏ.ఈ నుండి ఇండియా వెళ్ళే వారికి హెచ్చరిక

ఇండియాకి వెళ్ళే విదేశీయులకు శాటిలైట్‌ ఫోన్‌ విషయమై అబుదాబీ మరియు దుబాయ్‌లోని ఇండియన్‌ డిప్లమాటిక్‌ మిషన్స్‌ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తమతోపాటు శాటిలైట్‌ ఫోన్లను ఇండియాకి తీసుకెళ్ళవద్దని ఆ హెచ్చరికలో పేర్కొన్నారు. సోషల్‌ మీడియా ద్వారా మిషన్స్‌ ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. శాటిలైట్‌ ఫోన్లను ఇండియాకి తీసుకెళ్ళరాదనీ, అలా తీసుకెళ్ళేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయనీ ఇండియన్‌ మిషన్స్‌ స్పష్టం చేశాయి. యూఏఈలోని శాటిలైట్‌ ప్రొవైడర్స్‌, తమ సబ్‌స్క్రైబర్స్‌కి ఈ చట్టబద్ధమైన బ్యాన్‌ విషయాన్ని తెలియజేయాలని ఇండియన్‌ మిషన్స్‌ సూచించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com