సముద్రానికి చేరిన కిలావుయా అగ్నిపర్వతం..
- May 21, 2018
దాదాపు 15 రోజులుగా అమెరికా వాసులను భయపెడుతోంది కిలావుయా అగ్నిపర్వతం. హవాయి ద్వీపంలోని ఈ అగ్నిపర్వతం విస్పోటనంతో చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా నాశనమయ్యాయి. వందలాది ఇళ్లను, రోడ్లపై పార్క్ చేసిన కార్లు సైతం అగ్నిగి ఆహుతి అయ్యాయి. రోడ్లపై లావా ప్రవహిస్తుండడంతో విషవాయువులు గాల్లో కలుస్తున్నాయి. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ముందస్తు హెచ్చరికలతో ఖాళీ చేయించారు. విషవాయువుల ప్రభావానికి గురికాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అధికారులు మాస్క్‌లు అందిస్తున్నారు. తాజాగా ఈ లావా రోడ్డుపై నుంచి సముద్ర తీరం దగ్గర్లోకి వచ్చిందని యూఎస్ జియోలాజికల్ సర్వే సైంటిస్ట్ వెండీ స్టోవల్ తెలిపారు. సముద్రతీర వాసులను, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను, బీచ్‌కు వెళ్లే వారిని అప్రమత్రంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రంలోకి ఎవరూ వెళ్లవద్దని, బోట్లను కూడా సముద్రం ఒడ్డున ఉంచవద్దని హెచ్చరిస్తూ సివిల్ డిఫెన్స్ నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







