భార్యను చంపేసి దుబాయ్ చెక్కేసిన భర్త
- May 21, 2018
హైదరాబాద్: పాతబస్తీలో కలకలం రేపిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. భర్తే ఆమెను హత్య చేసి రైల్వేట్రాక్ వద్ద పడేసినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం డబీర్‌పూర్ స్టేషన్‌కు కొద్ది దూరంలో బియ్యపు బస్తాలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా భర్తే మహిళను హత్య చేశాడని, హతుడు పాతబస్తీకి చెందిన హైదర్ ఖాన్‌గా గుర్తించారు. హత్యకు గురైన మహిళ ఖాన్‌కు మూడో భార్యగా తెలుస్తోంది.
ఇద్దరు భార్యలను వదిలేసిన ఖాన్ మూడో భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు. కాగా హత్య చేసిన అనంతరం ఖాన్ తన ఇద్దరు చిన్నారులతో పాటు దుబాయ్ పారిపోయాడు. హంతకుడి ఇంటికి వెళ్లిన పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ హత్య గురించి తనకు తెలియదని, అలాగే తన కొడుకు పిల్లలతో కలిసి ఎక్కడి వెళ్లారో తెలియదని హతుడి తల్లి పోలీసులకు తెలిపింది.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







