స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం: 30 మంది అరెస్ట్
- May 21, 2018
జెడ్డా:సౌదీ బోర్డర్ గార్డ్స్, 1,117 కిలోగ్రాముల హాషిస్ని స్మగుల్ చేస్తున్న 30 మందిని అరెస్ట్ చేశారు. మే 7 నుంచి 19 వరకు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో హాషిస్ డ్రగ్స్ దొరికాయి బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్‌కి. వివిధ దేశాలకు చెందిన 30 మంది స్మగ్లర్స్‌ని అరెస్ట్ చేసినట్లు బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్ వెల్లడించింది. బోర్డర్ గార్డ్స్ అధికార ప్రతినిథి కల్నల్ సహీర్ అల్ హార్బి మాట్లాడుతూ, అరెస్టయినవారిలో 13 మంది ఇథియోపియన్లు, ఆరుగురు సోమాలీలు, 11 మంది యెమనీలు వున్నారనీ, వీరిని విచారణ నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి అప్పగించడం జరిగిందని అన్నారు. బోర్డర్ గార్డ్స్ అత్యంత సమర్థవంతంగా ఈ తరహా నేరాల్ని అదుపు చేయగలుగుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







