రమదాన్: ఖతార్ పబ్లిక్ పార్క్‌ల సమయం పొడిగింపు
- May 21, 2018
దోహా:పబ్లిక్ పార్కులు మధ్యాహ్నం 3 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు తెరచి వుంచుతున్నట్లు దోహా మునిసిపాలిటీ వెల్లడించింది. రమదాన్ సందర్భంగా పార్క్‌ల సందర్శన వేళల్ని పొడిగించినట్లు అధికారులు తెలిపారు. మునిసిపాలిటీకి చెందిన జనరల్ మానిటరింగ్ డిపార్ట్మెంట్ - టెక్నికల్ మానిటరింగ్ సెక్షన్, ఛారిటీ ఆర్గనైజేషన్స్ అలాగే హోటల్స్ మరియు ఇండివిడ్యువల్స్ రమదాన్ సందర్భంగా ఇఫ్తార్ కోసం టెంట్లను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆయా సంస్థలు, వ్యక్తులు ముందుగా అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. నిబంధనలకు అనుగుణంగా షాప్సని ఏర్పాటు చేసుకునేందుకు ఇన్స్పెక్టర్స్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షిస్తారు. రమదాన్ 14వ రోజున ఖతార్‌లో ఘనంగా జరిపే గరాంగావ్ ఫెస్టివల్ కోసం వినియోగింంచే ప్రోడక్ట్స్‌ని సైతం ఇన్స్పెక్టర్స్ తనిఖీ చేస్తారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







