నేటినుంచి మోదీ విదేశీ పర్యటన

- May 28, 2018 , by Maagulf
నేటినుంచి మోదీ విదేశీ పర్యటన

ఢిల్లీ: ప్రధాని మోదీ మరో మూడు విదేశీ పర్యటనలకు బయల్దేరి వెళ్తున్నారు. నేటి నుంచి ఆసియా దేశాలైన ఇండోనేషియా, సింగపూర్, మలేషియాలో ఆయన పర్యటించనున్నారు. మొట్టమొదట ఇండోనేషియా రాజధాని జకార్తాకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ఆ దేశ ప్రధానితో సమావేశమై రక్షణ, వాణిజ్యరంగాలు, ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు చర్చించనున్నారు. అనంతరం సింగపూర్, మలేషియాలో పర్యటించి ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించడంపై చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com