ఆఫ్రికాలో శ్రీశ్రీ రవిశంకర్ 'మహా ధ్యానం'
- May 28, 2018
ఆఫ్రికా ఖండంలో శాంతి స్థాపనే లక్ష్యంగా మహా ధ్యాన కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక నేత, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్ నిర్వహించారు. దీనిలో లక్ష మందికిపైగా ఆఫ్రికావాసులు వెబ్క్యామ్ల సాయంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆఫ్రికాలో నిర్వహించడం ఇది ఆరోసారి. దీనిలో 20 ఆఫ్రికా దేశాలవాసులతోపాటు ఇతర దేశాల పౌరులూ పాల్గొన్నారు. ఉగాండాలోని పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్న 66 మంది ఖైదీలూ దీనిలో పాలుపంచుకొన్నారు. ఎక్కువ మందికి చేరువ కావడమే లక్ష్యంగా రవిశంకర్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని ఆఫ్రికా వ్యాప్తంగా రేడియోల్లో ప్రసారంచేశారు. దీనిలో ధ్యానంతో ఒనగూరే అమూల్యమైన ప్రయోజనాల గురించి రవిశంకర్ వివరించారు. కార్యక్రమానికి మంచి స్పందన లభించిన నేపథ్యంలో.. మరో వారం రోజులపాటు దీన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







