నేరెళ్ల వేణుమాధవ్‌కు విశిష్ఠ పురస్కారం

- May 31, 2018 , by Maagulf
నేరెళ్ల వేణుమాధవ్‌కు విశిష్ఠ పురస్కారం

హైదరాబాద్: విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్‌ పద్మశ్రీ డాక్టర్‌ నేరెళ్ల వేణుమాధవ్‌ రాష్ట్రప్రభుత్వ విశిష్ఠ పురస్కారానికి ఎంపికవడం పట్ల ప్రముఖ మిమిక్రీ కళాకారుడు కళారత్న మల్లం రమేష్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారాన్ని అందజేయనున్నారు. దాదాపు 86సంవత్సరాల వయసులో ఆయనను అవార్డుకు ఎంపిక చేయడాన్ని బట్టి చూస్తే సీఎం కేసీఆర్‌కు పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. డాక్టర్‌ నేరెళ్ల వేణుమాధవ్‌ను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేయడంతో యావత్‌ మిమిక్రీకళాకారులు, సమాజం హర్షిస్తోందని రమేష్‌ వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com