మలేసియా ప్రధానితో మోదీ భేటీ
- May 31, 2018
కౌలాలంపూర్: మూడు దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం మలేసియా చేరుకున్నారు. ఈ ఉదయం కౌలాలంపూర్ చేరుకున్న మోదీకి ఆ దేశ అధికారులు సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి పుత్రజయ వెళ్లి మలేసియా నూతన ప్రధాని మహతీర్ మహ్మద్‌ను కలిశారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ప్రధానిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మహతీర్‌కు మోదీ అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య వ్యూహత్మాక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశంపై వీరిద్దరూ చర్చలు జరిపారు.
మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ బుధవారం ఇండోనేషియాలో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు జోకో విడోడోతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. అక్కడి నుంచి సింగపూర్ బయల్దేరిన ప్రధాని మోదీ.. మధ్యలో మలేసియాలో ఆగారు. మలేసియా నూతన ప్రధాని మహతీర్‌ను అభినందించేందుకు మోదీ ప్రత్యేకంగా అక్కడికి వెళ్లారు. కౌలాలంపూర్ నుంచి మోదీ సింగపూర్ వెళ్తారు. రేపు షాంగ్రీ -లా డైలాగ్‌లో జరగబోయే వార్షిక భద్రత సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. అనంతరం తన పర్యటన ముగించుకుని దిల్లీకి తిరిగివస్తారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







