షార్జా లో గంటకు 232 కిలోమీటర్ల వేగం: గుర్తించిన రాడార్
- May 31, 2018
షార్జా:షార్జా పోలీసులు, వాహనదారుల్ని జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిందిగా హెచ్చరించారు. స్పీడ్ లిమిట్స్‌కి లోబడి వాహనాల్ని నడపాల్సి వుంటుందని షార్జా పోలీస్ పేర్కొంది. ఇఫ్తార్, షురూర్ సమయాల్లో మరింత అప్రమత్తంగా వుండాలని సూచించారు షార్జా పోలీసులు. పవిత్ర రమదాన్ మాసంలో ఎలాంటి ప్రమాదాలకు తావివ్వరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. షురూర్ సమయానికి ముందు ఓ కారు గంటకు 231.6 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళిన విషయాన్ని షార్జా పోలీస్ ప్రస్తావించింది. మరో కారు ఇఫ్తార్ ముందు గంటకు 214.7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందనీ, ఈ రెండు కార్ల వేగాన్నీ రాడార్లు పసిగట్టాయని షార్జా పోలీస్ తెలిపింది. షార్జా పోలీస్ ట్రాఫిక్ అవేర్నెస్ డైరెక్టర్ మేజర్ జనరల్ అబ్దుల్ రహ్మాన్ మొహమ్మద్ ఖాతెర్ మాట్లాడుతూ, రమదాన్ వేళల్లో రోడ్లన్నీ జనంతో నిండి వుంటాయి గనుక, పరిమిత వేగంతో ప్రయాణించాల్సి వుంటుందని అన్నారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







