ఇండోనేసియా విమానాశ్రయంలో నకిలీ బాంబు కలకలం
- December 08, 2015
బాలి విమానాశ్రయంలో బొమ్మ బాంబుతో డేవిడ్ ఫోగ్లి (48) అనే బ్రిటన్ వ్యక్తి భయాందోళన సృష్టించాడు. బాలి నుంచి దోహా వెళ్లాల్సిన ఖతార్ ఎయిర్ వేస్ విమానం టేకాఫ్కు సిద్ధంగా ఉన్న సమయంలో.. అధికారులు డేవిడ్ను అతడితో పాటు వచ్చిన మరో మహిళా ప్యాసింజర్ను విమానం నుంచి కిందకు దింపేశారు. దీనికి కారణం డేవిడ్ వద్ద ఉన్న బొమ్మ. దీంతో అక్కడ కలకలం రేగింది. ఇద్దరిని విమానం నుంచి దింపేసి అధికారులు ప్రశ్నించారు. అది బొమ్మ అని, న్యూ ఇయర్ పార్టీ కోసం దానిని తీసుకెళ్లున్నట్లు డేవిడ్ చెప్పారు. కానీ ఈ బొమ్మకు డైనమైట్ స్టిక్స్, టైమర్ ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిని పట్టుకున్నారు. అది బొమ్మ బాంబు అని నిర్ధారించారు. కానీ అతడిని బొమ్మ కొన్న దుకాణానికి తీసుకు వెళ్లి పరిశీలించారు. అలాంటి బొమ్మలు ఉండడంతో అతడిని వదిలేశారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్‌లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







