అమరవీరులకు సియం కే.సి.ఆర్ నివాళి...

అమరవీరులకు సియం కే.సి.ఆర్ నివాళి...

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి సియం కేసిఆర్‌ నివాళి అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం అటు నుంచి పరేడ్‌గ్రౌండ్స్‌కు బయల్దేరారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల వందనాన్ని స్వీకరించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సియం ప్రసంగించనున్నారు.

Back to Top