'ETCA'ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు మరియు 'తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ' వేడుకలు
- June 02, 2018
దుబాయ్:తేది 01/06/2018 సాయంత్రం 7 గంటల నుండి 02/06/2018 ఉదయం 1 వరకు దుబాయ్ లోని ఆల్ వాసల్ స్పోర్ట్స్ క్లబ్ లోని లండన్ సూట్స్ లో పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా తెలంగాణ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును మరియు తెలంగాణ రాష్ట్రం సిద్దించి 4 సంవత్సరాల కాలం పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ కాన్సులేట్ దుబాయ్ కార్యాలయం నుండి శ్రీ నిర్వాన్ (వైస్ కాన్సుల్ - లేబర్ ) లోకల్ గౌరవ అతిథులుగా రమదాన్ అల్ ఆలీ (మినిస్ట్రీ అఫ్ లేబర్ డిపార్ట్మెంట్ అధికారి), సూపర్ జెట్ ట్రావెల్స్ అండ్ టూర్స్ ఎండీ మసియుద్దీన్ మహమ్మద్, ETCA వ్యవస్థాపకులు , యూఏఈ తెలంగాణ జాగృతి అధ్యక్షులు పీచర కిరణ్ కుమార్ , ETCA అధ్యక్షులు రాధారపు సత్యం , చీఫ్ అడ్వైసర్స్ తోట రామ్ కుమార్ , మంచుకొండ వెంకటేశ్వరులు మరియు అమీర్ (ఖజానా జువెల్లర్స్ - షార్జా మేనేజర్), అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఫౌండర్ కిరణ్ కుమార్ పీచర కిరణ్ కుమార్ మాట్లాడుతూ ETCA స్ధాపించిన 2011 నుండి సంఘ ముఖ్య ఉద్దేశంలలో ఒకటైన స్నేహ సద్బావ సామరస్య సంబందాల పెంపొందన అనే అంశాన్ని ఆదారంగా చేసుకొని యావత్ ప్రపంచంలోని ముస్లిం సోదరులు ప్రతి ఏట చేపట్టే పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షను, ముస్లిం సోదరులను వారి పండుగను గౌరవిస్తు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మతాలకు అతీతంగా నిర్వహించుకోవడం నిజంగా ఆనందదాయకం అని, రమదాన్ పవిత్ర మాస విశిష్టతను తెలుపుతూ హాజరయిన ముస్లిం సోదరులకు వారి కుటుంబ సభ్యులకు రమదాన్ కరీం శుభాకాంక్షలు తెలియచేసారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల త్యాగనిరది ని స్మరిస్తూ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు, తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయ శంకర్ అమర్ రహే అంటూ ఉద్యమంలో వారి అందించిన మార్గదర్శకాన్ని కొనియాడారు మరియు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమానికి సారథిగా నిలిచి తెలంగాణ భావజాలాన్ని , తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లడంలో అలుపెరుగని కృషి చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖర్ రావు ని ప్రశంసిస్తూ గల్ఫ్ బిడ్డల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు . జేఏసీ, విద్యార్ధి , ఉద్యోగ , మేధావుల , కవుల , కళాకారుల మరియు ప్రపంచంలోని వివిధ తెలంగాణ సంఘాల పాత్రను అభినందించారు.
ఎన్నారైల సంక్షేమానికి ముఖ్యమంత్రి ప్రకటించిన 50 కోట్లు నిధులను ఎన్నారై సెల్ ద్వార సమస్యలను పరిష్కరిస్తాం అని ప్రకటించడాన్ని స్వాగతిస్తామని, ఐఎస్ అధికారిని నియమించి నియంత్రణ నిర్వహణ , కమిటీ ఏర్పాట్ల బాధ్యతను గౌరవ ఎన్నారై శాఖ మాత్యులు కేటీఆర్ కి , పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కవిత కి బాధ్యతలు ఇవ్వడం గొప్ప పరిణామం అని కాని జాప్యం జరుగకుండ యుద్ధప్రాతిపదికన అధికారిక ప్రకటన చేయాలసిన బాధ్యత తెరాస ప్రభుత్వం పై ఉందని , కేటీర్ నేతృత్వంలో తయారయిన ఎన్నారై సంక్షేమ పాలసీ ముసాయిదాపై ఒక్కసారి ముఖ్యమంత్రి గారు పునః ఆలోచించి ఒక క్రమబద్ధమైన ఎన్నారై సంక్షేమ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేసి గల్ఫ్ బిడ్డల చిరకాల వాంఛను తీర్చాలసిన బాధ్యతను గుర్తు చేశారు. ఉద్యమానికి మరియు 2014 ఎన్నికల్లో సైతం గల్ఫ్ బిడ్డలు తెరాస పార్టీకి మద్దతు ఇచ్చారని, గల్ఫ్ దేశాల్లో మరణించిన పేద తెలంగాణ బిడ్డలకు సంక్షేమ నిధి నుండి ఎక్స్ గ్రేషియా అందించాలని మీరు గల్ఫ్ బిడ్డల సంక్షేమానికి భరోసా కల్పించినట్లయితే 2019 ఎన్నికల్లో లో కూడ మేము ప్రత్యక్షంగా వచ్చి మద్దతు తెలుపుతామని , ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించి ప్రకటన చేయాలని, ముఖ్యమంత్రి గల్ఫ్ దేశాల్లో పర్యటించాల్సిన అవసరం ఉందని దానికోసం గల్ఫ్ బిడ్డలు వేచి చూస్తున్నారని కిరణ్ కుమార్ తెలిపారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైస్ కాన్సుల్ శ్రీ నిర్వాన్ మాట్లాడుతూ రమదాన్ కరీం శుభాకాంక్షలు తెలియచేస్తూ , 2011 నుండి ETCA చేస్తున్న సాంస్కృతిక మరియు సేవ కార్యక్రమాలను అభినందించారు , కాన్సుల్ జనరల్ శ్రీ విపుల్ పర్యవేక్షణలో భారతీయులకు ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరించడానికి కృషి చేస్తామని , సమస్యల చేధనకై కాన్సులెట్ జనరల్ అఫ్ ఇండియా ఎప్పుడు అందుబాటులో ఉంటుందని, సమస్యల ఛేదనలో సాధించిన పురోగతిని వివరించారు , ETCA సభ్యులు అందచేసిన విజ్ఞప్తి లేఖను చదివి త్వరలో ఒక కీలక సమావేశం ఏర్పాటుకు కృషిచేస్తామని తెలిపారు, ఏ దేశంలో ఉన్న మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని అభినందించారు.
ఈ సందర్భంగా ETCA అధ్యక్ష్యులు రాధారపు సత్యం మాట్లాడుతూ హాజరు అయిన అందరికి రమదాన్ , తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు , 2018 సంబందించిన సంఘ కార్యక్రమాల క్యాలెండర్ ను ఆవిష్కరించారు, త్వరలోనే పిల్లలకు తెలుగు బాష నేర్పించడానికి , సాంస్కృతిక పరమైన నాట్య కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లలకు ఉచితంగా శిక్షణ అందేలా కృషిచేస్తామని , 2011 నుండి 2017 వరకు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని, గత మూడు సంవత్సరాలు గా తెలంగాణ జాగృతి తో సంయుక్తంగా వేడుకలు నిర్వహించామని ఈ ఏడాది కూడ 25 వేల భారీ జన సమీకరణ నడుమ షార్జా క్రికెట్ స్టేడియంలో వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు.చారిటీ టీం ద్వారా సేవ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ETCA - బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఫోరమ్ ను ఏర్పాటు చేశారు, ఫోరమ్ ముఖ్య ఉద్దేశ్యాలను, విధివిధానాలను ETCA వైస్ ప్రెసిడెంట్ అరవింద్ బాబు పవర్ పాంట్ ప్రెసెంటేషన్ ద్వార వెల్లడించారు , ఈ సందర్భంగా 36 కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కంపెనీల నిర్వాహకులు ఫోరమ్ లో సభ్యులుగా చేరడం విశేషం. ఈ ఫోరమ్ కి ఛైర్మెన్ గా ప్రముఖ వ్యాపారవేత్త SRR గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ తోట రామ్ కుమార్ ని , చీఫ్ అడ్వైసర్ గా మంచుకొండ వెంకటేశ్వరులు (మహాశ్వేత ఫుడ్ స్టఫ్ ట్రేడింగ్ మేనేజింగ్ పార్టనర్ ) ఎన్నుకొన్నారు. ఏడాది చివరి నాటికి యూఏఈ లో ఉన్న 7 ఎమిరేట్స్ లోని వ్యాపారులను, వివిధ కంపెనీలలో ఉన్నతమైన హోదాలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్రొఫెషనల్స్ ను ఒక త్రాటి పైకి తీసుకరావడం లక్ష్యమని, రెండో దశలో గల్ఫ్ దేశాలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న అందరిని కలిపి ఫోరమ్ విస్తృతం అయ్యేలా కృషి చేస్తామని ఛైర్మెన్ తోట రామ్ కుమార్ , సలహాదారు వెంకటేశ్వరులు , ప్రముఖ వ్యాపారవేత్త శంకర్ , మసియుద్దీన్ మొహమ్మద్ అన్నారు .
ఈ కార్యక్రమంలో నరేశ్ కుమార్ మాన్యం , పీచర వెంకటేశ్వర్ రావు , షేఖ్ షాదుల్లా, ఫహీమోద్దీన్ , నిస్సార్ మహమ్మద్ , సాయి చందర్, జయంత్, వంశీ, పరమేశ్ గౌడ్ , శ్రీనివాస్ ఎలిగేటి , జగదీశ్ రావు , భరద్వాజ్ , పవన్ కుమార్ , ప్రతాప్, శ్యామ్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి , శ్యామ్ గౌడ్ , శేఖర్, మహిళ విభాగ సభ్యులు , వ్యాపారులు , ప్రముఖులు , ముస్లిం సోదరులు, న్యాయవాది శ్రీమతి అనురాధ ఒబ్బిలిశెట్టి , మా గల్ఫ్.కామ్ ఫౌండర్ శ్రీకాంత్ చిత్తర్వు ,గల్ఫ్ అవగాహన వేదిక వ్యవస్థాపకులు కృష్ణ డోనికేని,ఆకుల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

_1527936823.jpg)

_1527936892.jpg)



_1527934119.jpg)
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







