బస్సుపై దాడి కేసులో జనవరి 12న విచారణ

- December 08, 2015 , by Maagulf
బస్సుపై దాడి కేసులో జనవరి 12న విచారణ

ఇంటీరియర్‌ మినిస్ట్రీకి చెందిన బస్సుపై తీవ్రవాదులు దాడి జరిపి, ఇద్దరు పబ్లిక్‌ సెక్యూరిటీ పర్సనల్‌ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని అడ్వొకేట్‌ జనరల్‌, టెర్రర్‌ క్రైమ్‌ ప్రాసిక్యూషన్‌ చీఫ్‌ అహ్మద్‌ అల్‌ హమ్మాది చెప్పారు. ఈ కేసులో 24 మందిని నిందితులుగా గుర్తించడం జరిగిందనీ, పలు సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారాయన. క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సిఐడి) ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితులపై అభియోగాల్ని రుజువు చేయనుంది. ఓ పొలిటికల్‌ సొసైటీకి చెందిన మెంబర్‌, ఇరాన్‌ నుంచి నిధులు సేకరించి, కొందర్ని రిక్రూట్‌ చేసుకుని మరీ ఉద్దేశ్యపూర్వకంగా బాంబులతో, మారణాయుధాలతో ఇంటీరియర్‌ మినిస్ట్రీ బస్సుపై దాడి చేశారని సిఐడి తేల్చింది. విచారణలో భాగంగా జరిగిన తనిఖీల్లో భారీగా మారణాయుధాలు నిందితుల నుంచి లభ్యమయ్యాయి. ఈ కేసు విచారణ జనవరి 12కి వాయిదా పడింది. ఆ రోజు హై క్రిమినల్‌ కోర్టులో విచారణ జరుగుతుంది. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com