అగ్నిప్రమాదంపై హెచ్ఎంసి విచారం
- December 08, 2015
హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి) తమ స్టాప్ అకామిడేషన్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి తమ ఉద్యోగి భార్య మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హెచ్ఎంసి టెక్నీషియన్ రఫీల్ పింగుల్ భార్య చోనా ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందగా, కుమార్తె మిసీలా ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. అలాగే పింగ్ కుమారుడు కూడా గాయాలతో చికిత్స పొందుతున్నాడు. హెచ్ఎంసి తమ ఉద్యోగుల కోసం క్వార్టర్స్‌ని నిర్వహిస్తోంది. ప్రమాదం తర్వాత క్వార్టర్స్‌లో ఎమర్జన్సీ సౌకర్యాల్ని మరింతగా పెంచాల్సిన ఆవశ్యకతపై హమాద్ మెడికల్ కార్పొరేషన్ దృష్టిపెట్టింది. ప్రమాదం సంభవించిన క్వార్టర్స్ నుంచి చాలామంది ఉద్యోగుల కుటుంబాలు ఖాళీ చేసేశాయి. వారికి ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లను హెచ్ఎంసి చేపట్టింది. ప్రమాద కారణాల్ని అన్వేషించి, ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హమాద్ మెడికల్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







