ఇరాక్‌:13 మంది తెలంగాణవాసులు బంధీలుగా నరకయాతన

- June 03, 2018 , by Maagulf

నిజామాబాద్:ఇరాక్‌లో 13 మంది తెలంగాణవాసులు బంధీలుగా నరకయాతన అనుభవిస్తున్నారు. భారీగా వేతనాలు అంటూ తమను బశ్రా ప్రాంతానికి ఏజెంట్లు అక్రమంగా తరలించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు బాధితులు షేర్‌ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బాధితుల్లో ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ వాసులు ఉన్నట్లు సమాచారం. తమకు కనీసం మంచినీరు కూడా దొరకడం లేదని, ఏజెంట్లు తమను మోసం చేశారంటూ వాట్సాప్‌ ద్వారా బాధితులందరూ కలిసి ఓ వీడియో పంపారు.

తెలంగాణ ప్రభుత్వం తమ వాళ్లను ఆదుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు కోరుతున్నారు. గల్ఫ్‌ బాధితుల సంఘం ప్రతినిధి బసంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ దృష్టికి ఇరాక్‌లో తెలంగాణ వాసుల బంధీ సమస్యను తీసుకెళ్లారు. ప్రస్తుతం బాగ్దాద్ లోని బశ్రాలో ఓ ప్రైవేట్ కంపెనీలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com