మనీ లాస్ అవ్వకుండా ఉండడానికి ఈ ట్రిక్ ట్రై చేసి చూడండి

- June 03, 2018 , by Maagulf
మనీ లాస్ అవ్వకుండా ఉండడానికి ఈ ట్రిక్ ట్రై చేసి చూడండి

ఈ ఏడాది మార్చి చివరి నాటికి సెన్సెక్స్ సూచీ 6 శాతం పతనం అయ్యింది. అయితే చాలా మంది ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. అయితే దీన్ని మార్కెట్ వర్గాలు స్వల్పకాలిక వోలటాలిటీగా భావించాయి. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్ నాటికే మ్యూచువల్ ఫండ్స్ ఫ్లో కూడా రూ. 159 బిలియన్లకు తగ్గుముఖం పట్టగా, ఈ మొత్తం ఈ ఆర్థిక సంవత్సరం మంత్లీ యావరేజీ అయిన రూ.217 బిలియన్ల కన్నా తక్కువ అనే చెప్పవచ్చు. మరోవైపు నిపుణులు మాత్రం సెల్లాఫ్ కు దూరంగా ఉండాలని సూచించినప్పటికీ, మార్కెట్లు మాత్రం కరెక్షన్ కు గురయ్యాయి. అయితే ఫండమెంటల్స్ పరంగా మాత్రం ఇండియన్ మార్కెట్లు ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నాయనేది నిపుణుల వాదన. అయితే ఈ వోలటాలిటీలో ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాలనేది ఇప్పుడు మదుపరుల ముందున్న అసలైన సవాలు. ప్రస్తుతం మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ కరెక్షన్ కు లోనై బయ్యింగ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కాస్త రిస్క్ తీసుకుంటే మీ పోర్ట్ ఫోలియోలు బలమైన స్టాక్స్ కు స్థానం కలుగుతుంది అనేది నిపుణుల వాదనగా ఉంది. 

సెల్లింగ్ అనేది ప్రస్తుత మార్కెట్లో మీ మదుపునకు అంత లాభదాయకం కాదని మార్కెట్ పండిట్స్ ఘంటా పథంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్స్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

స్వల్పకాలిక వోలటాలిటీకి దూరంగా ఉండటం..
ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి ముఖ్యంగా కావాల్సింది దూరద్రుష్టి. గత సంవత్సర కాలంలో మార్కెట్లు ఊహకు అందనంత స్థాయిలో పైకి ఎగిశాయి. ముఖ్యంగా మార్కెట్లు ఫండమెంటల్స్ తో సంబంధం లేకుండా గరిష్ట స్థాయిని టచ్ చేశాయి. ఈనేపథ్యంలో కరెక్షన్ అనేది సహజమే. అయితే ఈ సమయంలోనే మీరు ఎంపిక చేసుకున్న స్టాక్స్ లో ఫండమెంటల్స్ పరంగా బలమైన స్టాక్స్ ను గుర్తించి మీ డబ్బును ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఫండమెంటల్స్ లో ముందుగా గమనించాల్సింది క్యాష్ ఫ్లోస్, ఎర్నింగ్స్, కార్పోరేట్ గవర్నెన్స్, డెట్ టు ఈక్విటీ నిష్పత్తి, అలాగే మదుపరులు ముఖ్యంగా పీఈ(ప్రైస్ టు ఎర్నింగ్స్) నిష్పత్తిని కూడా గమనించాల్సి ఉంటుంది.

నష్టాల్లో మీ స్టాక్ ను వదులుకోవడం సెల్ చేయడం అంటే, మీ సంపదను కోల్పోవడమే, స్వల్పకాలిక కరెక్షన్స్ కు భయపడితే మాత్రం మీ డబ్బు నష్టపోయే ప్రమాదం ఎక్కువ. ఫండమెంటల్స్ బలహీనంగా ఉంటే మినహా మరే ఇతర సందర్భంలోనూ మీరు నష్టాల్లో స్టాక్ ను అమ్మే సాహసం చేయకూడదు. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే మీ సంపద సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు అని అర్థం. 

లార్జ్ క్యాప్స్ వైపు చూడండి...
మిడ్ క్యాప్, అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ లో చాలా వరకూ వాలటాలిటీ ఉండటం  సహజం. మిడ్ క్యాప్స్ ఇప్పటి వరకూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. అయితే ప్రస్తుతం మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్స్ మార్కెట్ ప్రెజర్ లో ఉన్నప్పటికీ స్థిరంగా ట్రేడయ్యే లార్జ్ క్యాప్స్ పై చూపు మళ్లించాల్సిన సమయం ఆసన్నమైంది. మీ పోర్ట్ ఫోలియోలో లార్జ్ క్యాప్ స్టాక్స్ లాంగ్ రన్ కోసం ఉపయోగ పడతాయి. మిడ్ క్యాప్స్, లేదా స్మాల్ క్యాప్స్ మార్కెట్ కరెక్షన్ లో అత్యధికంగా వోలటాలిటీకి గురవుతాయి. అదే సమయంలో లార్జ్ క్యాప్స్ మాత్రం వేల్యూయేషన్స్ పరంగా బలంగా పెద్ద మొత్తంలో ట్రేడవుతూ మార్కెట్ ఆధారంగా కదలికలు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ నేపథ్యంలో మిడ్ క్యాప్స్ కన్నా లార్జ్ క్యాప్స్ పెర్ఫార్మమెన్స్ చాలా స్థిరంగా ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com