పవన్ విరాళంపై వర్మ అభినందనలు..
- December 09, 2015
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెన్నై వరద బాధితులకు అండగా నిలిచాడు. 'సర్దార్ గబ్బర్‌సింగ్' షూటింగ్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కాస్త ఆలస్యంగా స్పందించినా... తనదైన శైలిలో బాధితులను ఆదుకునేందుకు విరాళాన్ని ప్రకటించినట్లు దర్శకుడు వర్మ తన ట్విట్ల ద్వారా తెలిపాడు. చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేసిన వరదల కారణంగా రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం తీవ్ర ఇక్కట్లు పడుతున్న విషయం విధితమే. వరద బాధితుల సహాయార్థం ఇప్పటికే పలువురు టాలీవుడ్, కోలీవుడ్ తారలతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా తమ విరాళాన్ని ప్రకటించి చెన్నై బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చెన్నై బాధితుల సహాయార్థం రెండు కోట్ల రూపాయలు విరాళాన్ని ప్రకటించినట్టు వర్మ ట్విట్ల ద్వారా తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ''కొన్నిసార్లు రావడం లేట్ అవుతుందేమో కానీ.. రావడం మాత్రం పక్కా' అని గబ్బర్‌సింగ్ చిత్రంలో పవన్ చెప్పిన డైలాగు నిజమేనని మరోసారి నిరూపించాడంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే....పవన్ విరాళంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా అభినందనలు
తాజా వార్తలు
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్
- ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఘన విజయం..
- గూగుల్ మ్యాప్స్‌లో కొత్త అప్డేట్..
- కువైట్‌లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!







