'అబ్బాయితో అమ్మాయి' ఈ నెల 24న విడుదల ..
- December 09, 2015నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్న చిత్రం అబ్బాయితో అమ్మాయి. రమేష్‌వర్మ దర్శకుడు. వందన అలేఖ్య, కిరిటీ, శ్రీనివాస్ నిర్మాతలు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మల్టీడైమన్షన్ వాసు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఆడియో, ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇళయరాజా స్వరపరచిన గీతాలు శ్రావ్యమైన బాణీలతో శ్రోతల్ని అలరిస్తున్నాయి. హృదయానికి హత్తుకునే ప్రేమకథా చిత్రమిదని, తమిళంలో కూడా విడుదల చేయమని ఇళయరాజాగారు సూచించారు. సి. కల్యాణ్‌గారు తమిళంలో విడుదల చేస్తున్నారు అన్నారు. అన్ని వర్గాల్ని అలరించే హృద్యమైన ప్రేమకథా చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. నాగశౌర్య మాట్లాడుతూ ఇళయరాజా సంగీతాన్నందిస్తున్న 999 చిత్రమిది. సినిమా చూసిన పరిశ్రమ ప్రముఖులు చాలా మంది బాగుందని ప్రశంసించారు. వినోదానికి పెద్దపీట వేస్తూ ప్రేమలోని సున్నితమైన భావాలకు అందమైన దృశ్యరూపంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అన్నారు. పొయెటిక్‌గా సాగే ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని, హృదయానికి హత్తుకునే సన్నివేశాలుంటాయని దర్శకుడు చెప్పారు. బహ్మానందం, రావు రమేష్, మోహన్, ప్రగతి, తులసి, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్యాం కె నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురళీకృష్ణ కొడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







