మస్కట్:వాటర్‌ బాటిల్స్‌లో బ్యాక్టీరియా, అల్గాయ్‌

- June 08, 2018 , by Maagulf
మస్కట్:వాటర్‌ బాటిల్స్‌లో బ్యాక్టీరియా, అల్గాయ్‌

మస్కట్‌: అనారోగ్యకరమైన పరిస్థితుల్లో వున్న వాటర్‌ బాటిల్స్‌ని విక్రయిస్తున్న కారణంగా ఓ కంపెనీకి 600 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధించినట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ (పిఎసిపి) పేర్కొంది. ఓ వినియోగదారుడి ఫిర్యాదు మేరకు పిఎసిపి అధికారులు తనిఖీలు నిర్వహించగా, తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. వాటర్‌ బాటిల్స్‌లోని నీటిలో బ్యాక్టీరియా, అల్గాయ్‌ కన్పించాయి. ఈ బాటిల్స్‌లో నీరు తాగితే అనారోగ్యం పాలవడం ఖాయమని అధికారులు పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్‌కి జరీమానా విధించడమే కాక, హెచ్చరికలు కూడా జారీ చేశామని అధికారులు తెలిపారు. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించేలా, వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా డిస్ట్రిబ్యూటర్స్‌, విక్రయదారులు వ్యవహరించరాదని అధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com