జూన్ 22న వస్తున్న'జంబ లకిడి పంబ'

- June 09, 2018 , by Maagulf
జూన్ 22న వస్తున్న'జంబ లకిడి పంబ'

ఈవీవీ సత్యనారాయణకి మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రాల్లో .. తెలుగులో అద్భుతమైన హాస్యాన్ని అందించిన చిత్రాల జాబితాలో 'జంబ లకిడి పంబ' పేరు కనిపిస్తుంది . అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ సినిమాను ఎవరూ మరిచిపోలేదు. అంతగా ఆ కంటెంట్ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. మళ్లీ ఇంత కాలానికి అదే టైటిల్ తో పూర్తి హాస్య భరితంగా ఓ సినిమా రూపొందింది.

మురళీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి .. సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలను పోషించారు. పోసాని కృష్ణ మురళి .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేదీని తెలియపరుస్తూ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ మధ్యకాలంలో వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రం హీరోగా శ్రీనివాసరెడ్డికి మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఇక 'జంబ లకిడి పంబ' హిట్ కొడితే, మరిన్ని హాస్యరసభరిత చిత్రాల్లో హీరోగా ఆయన బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com