ఫ్రెంచ్ ఓపెన్ లో స్పానిష్ బుల్ రాఫెల్ సరికొత్త రికార్డు
- June 09, 2018
స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్.ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు 11వ సారి చేరి చరిత్ర సృష్టించాడు. తన కెరియర్ లో ఇంతకుముందు ఫైనల్స్ చేరిన పదిసార్లు విజేతగా నిలిచిన నడాల్. ప్రస్తుత 2018 టోర్నీలో సైతం టైటిల్ సమరానికి అర్హత సంపాదించాడు.
పారిస్ లోని రోలాండ్ గారోస్ సెంటర్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో సెమీఫైనల్లో టాప్ సీడ్ నడాల్ 6-4, 6-1, 6-2తో అర్జెంటీనా జెయిట్, 5వ సీడ్ జువాన్ మార్టిన్ డెల్ పోత్రోను చిత్తు చేశాడు.
2 గంటల 17 నిముషాలపాటు సాగిన పోరులో నడాల్. తన ట్రేడ్ మార్క్ క్లేకోర్ట్ గేమ్ తో చెలరేగిపోయాడు. సూపర్ సండే టైటిల్ ఫైట్ లో ఏడోసీడ్ డోమనిక్ థీమ్ తో నడాల్ పోటీపడనున్నాడు.
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో..రోజర్ ఫెదరర్ వింబుల్డన్ ఫైనల్స్ 11 సార్లు చేరి చరిత్ర సృష్టిస్తే.అదే ఘనతను ఫ్రెంచ్ ఓపెన్లో నడాల్ సొంతం చేసుకొని తనకు తానే సాటిగా నిలిచాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..