బహ్రెయిన్: జీతాల కోసం కార్మికుల ఆందోళన
- June 12, 2018
బహ్రెయిన్:ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన కార్మికులు, తమకు జీతాలు చెల్లించడంలేదంటూ లేబర్ కోర్ట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కి చెందిన కార్మికులే ఎక్కువగా వున్నారు బాధితుల్లో. నాలుగు నెలలకు పైగానే వీరందరికీ సదరు కంపెనీ జీతాలు చెల్లించడంలేదు. కాగా, లేబర్ కోర్ట్ వైపు వెళుతున్న ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డగించారు. తిరిగి వారిని లేబర్ కేంప్స్‌కి వెళ్ళేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వారి ప్రతినిథుల్ని మాత్రం లేబర్ మినిస్ట్రీ అధికారుల్ని కలిసేందుకు పోలీసులు అనుమతించారు. అమెరికన్ మిషన్ హాస్పిటల్ వద్ద కార్మికుల్ని అడ్డుకుని, వారిని బుజ్జగించి పోలీసులు వెనక్కి పంపినట్లు అధికారులు తెలిపారు. భారత జాతీయులే సదరు కంపెనీని నిర్వహిస్తున్నట్లు తేలింది. లేబర్ మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ మొహమ్మద్ అలి అల్ అన్సారీ మాట్లాడుతూ, ఈ విషయమై మినిస్ట్రీ విచారణ ప్రారంభించిందని అన్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







