మస్కట్:ఇసుక లారీల్లో సిగరెట్స్ స్మగ్లింగ్
- June 12, 2018
మస్కట్: ఒమన్ కస్టమ్స్, ఇసుక లారీల్లో సిగరెట్లు, నమిలే పొగాకుని స్మగ్లింగ్ చేస్తుండగా ఆ ప్రయత్నాన్ని భగ్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో 10,200 ప్యాకెట్ల సిగరెట్లు, 600 కిలోగ్రాముల నమిలే పొగాకుని కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది. వాడి అల్ జిజి బోర్డర్ కస్టమ్స్, అత్యంత చాకచక్యంగా ఈ స్మగ్లింగ్‌ని అడ్డుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ తరహా స్మగ్లింగ్ చాలా ఆశ్చర్యకరంగా వుందని అధికారులే విస్మయం వ్యక్తం చేశారు. కస్టమ్స్ అధికారులు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నా, స్మగ్లర్లు సైతం తెలివైన మార్గాల్లో దేశంలోకి నిషేధిత వస్తువుల్ని తరలించేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. ఇదిలా వుంటే, మస్కట్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ వ్యక్తి 8.7 కిలోల మరిజువానా, 1,285 నార్కోటిక్ ట్యాబ్లెట్స్‌ని కార్బన్ పేపర్‌లో దాచి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..