యు.ఏ.ఈ:నీట మునిగిన ఇద్దర్ని రక్షించిన సివిల్ డిఫెన్స్
- June 16, 2018
అజ్మన్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది నీటిలో మునిగిపోతున్న ఇద్దర్ని చాకచక్యంగా రక్షించడం జరిగింది. ఈద్ అల్ ఫితర్ సెలవుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితులు ఇద్దరూ ఆసియాకి చెందినవారు. బలమైన కెరటాల తాకిడికి వీరు నీట మునిగినట్లు సివిల్ డిఫెన్స్ సిబ్బంది పేర్కొన్నారు. మరో ఘటనలో ఆఫ్రికాకి చెందిన ఓ వ్యక్తి అల్లకల్లోలంగా వున్న సముద్రంలో ఇరక్కుపోగా, అతన్ని సివిల్ డిఫెన్స్ సిబ్బంది బయటకు తీసేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అజ్మన్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దుల్ అజీజ్ అల్ షామ్సి చెప్పారు. రాత్రి వేళల్లో కొన్ని బీచ్‌లలో భద్రతా కోణంలో స్విమ్మింగ్‌ని బ్యాన్ చేసినట్లు చెప్పారు. రెస్క్యూ టీమ్స్ ఎల్లప్పుడూ ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారాయన.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..