హైదరాబాద్‌లో 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్..
- June 17, 2018
హైదరాబాద్‌లో 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరుగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. తెలుగులో ''బాహుబలి-2'' చిత్రం 8 అవార్డులను కొల్లగొట్టగా, అర్జున్ రెడ్డి చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ ఎంపికయ్యారు. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కైవసం చేసుకున్నారు.
ఇక తెలుగులో ఉత్తమ చిత్రంగా బాహుబలి-2 నిలువగా, ఉత్తమ దర్శకుడిగా అదే చిత్రానికి గాను ఎస్ఎస్ రాజమౌళి అవార్డును అందుకున్నారు. ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి), ఉత్తమనటిగా సాయిపల్లవి (ఫిదా), ఉత్తమ సహాయ నటిగా రమ్యకృష్ణ (బాహుబలి 2), ఉత్తమ సహాయ నటుడిగా రానా దగ్గుబాటి (బాహుబలి 2), ఉత్తమ నటి (తొలి పరిచయం)గా కల్యాణ్ ప్రియదర్శన్ (హలో) అవార్డులు పొందారు.
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా సెంథిల్ కుమార్ (బాహుబలి 2), ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా శేఖర్ మాస్టర్ (ఫిదా), ఉత్తమ గేయ రచయితగా ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా పాటకు), ఉత్తమ నేపథ్య గాయకుడిగా హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్), ఉత్తమ నేపథ్య గాయనిగా మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్), ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2), ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు సిరిల్ (బాహుబలి 2) అవార్డులు అందుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







