సెక్స్ రాకెట్ లో సినీనటులు దొరకడంపై..శివాజీరాజా సంచలన నిర్ణయం!
- June 17, 2018
అమెరికాలోని ఓ భారీ సెక్స్ రాకెట్ బయటపడిన సంగతి అందరికి తెలిసిందే. ఓ రెండు మూడు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత దంపతులు ఈ వ్యభిచార గృహాన్ని నడిపిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఆ గృహంపై దాడి చేశారు. తెలుగు దంపతులను అక్కడి ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 34 ఏళ్ల మోదుగుమూడి కిషన్ అనే వ్యాపారవేత్త ఈ సెక్స్ దందా నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే పలువురు నటీమణులు, విటులను అరెస్ట్ చేసిన ఎఫ్బిఐ పోలీసులు మరికొందరిని విచారిస్తున్నారు. అందులో భాగంగా పలువురు ఈవెంట్స్ మేనేజర్స్, ప్రోగ్రాం కోఆర్డినేటర్లను విచారించినట్టు తెలుస్తోంది. అయితే ఈ తతంగానికి ప్రోగ్రాం నిర్వహణ దారులకు సంబంధం లేకపోయినా ఏవైనా ఆధారాలు దొరుకుతాయనే కారణంతో వారిని విచారించారు. వారు అమెరికాలో జరుగుతున్నసాంస్కృతిక కార్యక్రమాలకు కొందరు సెలబ్రిటీలను ఆహ్వానిస్తారు అందులో కొంతమందికి డబ్బు ఆశచూపి ఇలా చేస్తున్నారు.అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని అమెరికాలోని పలు తెలుగు సంఘాలు సూచిస్తున్నాయి. ఇదిలావుంటే ఈ వ్యవహారంపై టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా స్పందించారు.. ఇకపైన పరిశ్రమకి చెందిన వ్యక్తులకు విదేశాల నుంచి ఆహ్వానం అందితే ఆ విషయాన్ని 'మా' దృష్టికి తీసుకురావాలని నటీనటులకి సందేశాలు పంపుతున్నట్టు అయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!