ఆన్లైన్లోనే రస్ అల్ ఖైమా డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్
- June 18, 2018
రస్ అల్ ఖైమా డ్రైవింగ్ లైసెన్సులు వ్చే వారం నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే రెన్యువల్ చేసుకోవాల్సి వుంటుంది. జూన్ 24 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని రస్ అల్ ఖైమా పోలీస్ - లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ప్రస్తుతం ఐదు సెంటర్స్‌తో సంయుక్తంగా సైట్ టెస్ట్స్ నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీని సంప్రదించాల్సిన అవసరం లేకుండానే జబెర్ ఆప్టికల్, రస్ అల్ ఖైమా హాస్పిటల్, ఇంటర్నేషనల్ స్పెషలైజ్డ్ సెంటర్, సమీర్ ఆప్టిక్స్ సెంటర్స్, బెల్హాసా డ్రైవర్స్ వద్ద ఈ పరీక్షలు జరుగుతాయి. వృద్ధులు, వివకాలుంగులకు కొత్త రూల్ నుంచి మినహాయింపునిచ్చారు. వినియోగదారుల విలువైన సమయం వృధా కాకుండానే ఈ ఆన్లైన్ విధానం తెచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్త విధానానికి సంబంధించి బ్రోచర్లు అరబిక్, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







