న్యూస్ చదువుతూ ఏడ్చిన యాంకర్

- June 20, 2018 , by Maagulf
న్యూస్ చదువుతూ ఏడ్చిన యాంకర్

అమెరికా:హద్దుల గురించి, సరిహద్దుల గురించి చిన్నారులకు ఏం తెలుస్తుంది. అమ్మా నాన్న ఎక్కడికి తీసుకు వెళితే అక్కడకు వారి వేలు పట్టుకుని వెళ్లడం మాత్రమే తెలుసు. పెద్దవాళ్ల గొడవల మధ్యలో అభం శుభం తెలియని చిన్నారులు నలిగిపోతున్నారు. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా తరలి వస్తున్నారంటూ ట్రంప్ ప్రభుత్వం వలసదారులను నిర్భంధిస్తోంది. తల్లిదండ్రుల నుంచి పిల్లలని వేరు చేస్తోంది. వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెండర్ ఏజ్ షెల్టర్ల‌కు వారిని తరలిస్తుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన అమెరికా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వార్తలు చదువుతున్న టీవీ యాంకర్‌ భావోద్వేగానికి గురైంది. ఆ న్యూస్ చదవలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. ఎంఎస్‌ఎన్‌బీకి చెందిన యాంకర్ రేచల్ మాడో ఇప్పుడే అందిన వార్త అంటూ తల్లిదండ్రులు కనిపించక పిల్లలు ఏడుస్తున్నారు అని వార్త చదివేసరికి కళ్లవెంట నీళ్లు వచ్చాయి. ఆ తరువాత ఆమె క్షమాపణలు చెప్పింది. తనను తాను నియంత్రించుకోలేకపోయానని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com