ఇండోనేషియా:సరస్సులో మునిగిన బోటు.. 180 మంది గల్లంతు
- June 20, 2018
సుమత్రా: ఇండోనేషియాలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. దీంతో దాంట్లో ప్రయాణిస్తున్న 180 ప్రయాణికులు ఆచూకీ లేకుండాపోయింది. సామర్థ్యం కంటే మూడు రేట్లు ఎక్కువ మంది ప్రయాణికులు బోటులో ఉన్నట్లు తెలుస్తోంది. లేక్ తోబాలో ఈ దుర్ఘటన జరిగింది. ఈద్ సంబరాల నేపథ్యంలో భారీ స్థాయిలో సరస్సు పర్యాటకులు వచ్చారు. ప్రస్తుతం సుమత్రా దీవుల్లో వాతావరణం ప్రతికూలంగా ఉంది. బోటులోనే అనేక మంది ప్రయాణికులు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 18 మందిని మాత్రమే రక్షించారు. అయితే ఈ విషాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం కూడా స్పష్టంగా తెలియదు. గజ ఈతగాళ్లు, అండర్‌వాటర్ డ్రోన్‌లతో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లేక్ తోబా సుమారు 450 మీటర్ల లోతు ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఏ ప్రాంతంలో బోటు మునిగిందన్న విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. సుమారు 25 మంది డైవర్లు .. అదృశ్యమైనవారి కోసం అన్వేషిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







