వీరిలో 52 మంది భారతీయులున్నారని.. వారి పిల్లలను, జీవిత భాగస్వాముల నుంచి వేరు చేస్తున్నారు.

- June 20, 2018 , by Maagulf
వీరిలో 52 మంది భారతీయులున్నారని.. వారి పిల్లలను, జీవిత భాగస్వాముల నుంచి వేరు చేస్తున్నారు.

అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. అమెరికా- మెక్సికో సరిహద్దు వద్ద అక్రమ వలసదారుల రాకను నిరోధించేందుకు అమెరికా పోలీసులు రంగంలోకి దిగారు. వేలాది మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు. వీరిలో 52 మంది భారతీయులున్నారని.. వారి పిల్లలను, జీవిత భాగస్వాముల నుంచి వేరు చేస్తున్నారు.
అరెస్టయిన వారిని ఓరెగాన్ లోని ఫెడరల్ జైల్లో బంధించిన అధికారులు, చట్ట వ్యతిరేకంగా తమ దేశంలోకి వచ్చే వారిని ఇకపై ఏమాత్రం ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో 123 మంది వలసదారులు అరెస్టయ్యారు. వీరిలో అత్యధికంగా దక్షిణాసియా వారే వున్నారు. హిందీ, పంజాబీ మాట్లాడే వారి సంఖ్యే ఇందులో అధికంగా వున్నట్లు తెలుస్తోంది.

అమెరికాకు వచ్చే వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేసి, శరణాలయాలకు తరలిస్తున్నారు. తల్లిదండ్రులు కనిపించకుండా వారు ఎప్పుడు వస్తారో తెలియక పిల్లలు బోరున విలపిస్తున్నారు. ఆ పిల్లలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. ట్రంప్ సర్కారు వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ఆయన మాత్రం వలసదారుల విషయంలో మెత్తబడే సమస్యే లేదని స్పష్టం చేస్తున్నారు. కుటుంబం నుంచి పిల్లలను వేరు చేయాలన్న ఆలోచన అత్యంత కిరాతకమైన చర్యని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com