​ఉమ్ అల్ కువైన్ లో ఘనంగా జరుపుకున్న 'ప్రపంచ యోగా దినోత్సవం'

- June 20, 2018 , by Maagulf

ఉమ్ అల్ కువైన్:నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గత రాత్రి అల్ వాసల్ స్పోర్ట్స్ క్లబ్ లో ఉమ్ అల్ కువైన్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముందుగా కాన్సల్ జనరల్ విపుల్ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమములో సెక్రటరీ జనరల్ హుమైడ్ రషీద్ అల్ షంసి,గవర్నమెంట్ ఆఫ్ ఉమ్ అల్ కువైన్ నుంచి మీరా మొహమ్మద్,గిరీష్ పంత్,జువ్వాడి శ్రీనివాస్,కుంభాల మహేందర్ రెడ్డి,బాలకిషన్ జంగం తదితరులు పాల్గొన్నారు.కాన్సల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, అది మనకు మన ప్రాచీన భారతీయులు అందించిన బహుమతి అని అన్నారు.యోగా అనేది అన్ని పనులపై ఏకాగ్రతను పెంచడమే కాకుండా కుటుంబంలో, సమాజంలో సద్భావనను కల్పిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నాలుగు వందల మంది పైగా పాల్గొన్నారు.

అజ్మన్‌లోని ఇండియన్‌ అసోసియేషన్‌ ప్రిమైసిస్‌లో జూన్‌ 21న సాయంత్రం 7 గంటలకు, షార్జాలోని ఎక్స్‌పో సెంటర్‌లో జూన్‌ 22న సాయంత్రం 4 గంటలకు, ఫుజైరాలో మీడియా పార్క్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జూన్‌ 22న 6.30 నిమిషాలకు, రస్‌ అల్‌ ఖైమాలో జూన్‌ 22న అమెరికన్‌ యూనివర్సిటీలో 7 గంటలకు ఈ ఈవెంట్‌ జరుగుతుంది. యోగా పట్ల ఆసక్తి వున్నవారంతా దుబాయ్‌లోని మెయిన్‌ ప్రోగ్రామ్‌తోపాటు, ఇతర ఎమిరేట్స్‌లో నిర్వహించే ఈవెంట్స్‌లోనూ పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్స్‌లోకి ప్రవేశం ఉచితం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com