బుర్ దుబాయ్‌లో ఖేలైయా వర్క్ షాప్
- June 21, 2018
దుబాయ్:గార్భా మరియు సల్సా ఫ్యుజన్ డాన్స్‌కి సంబంధించి ఖేలైయా వర్క్ షాప్‌ని రాయల్ ఆస్కాట్, బుర్ దుబాయ్‌లోని స్ప్రీ క్లబ్లో జూన్ 16 నుంచి 19 వరకు నిర్వహించారు. 4 రోజులపాటు సాగిన ఈ వర్క్ షాప్‌లో 80 మందికి పార్టిసిపెంట్లు పాల్గొన్నారు. ఆండియా కింగ్ జెనిష్ వ్యాస్ నుంచి డాన్సుల్ని నేర్చుకున్నారు. దుబాయ్‌లో ప్రముఖ సోషల్ మరియు మీడియా పర్సనాలిటీ కోమల్ సెలార్కా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ యాంకర్ జో మోహన్ అలియాస్ వాయిజ్ గై జో ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డాక్టర్ శైలేష్ ఉపాధ్యాయ్, చంద్రికా గడివి, డిజె కరణ్ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వీరంతా ఆయా రంగాల్లో తమదైన ప్రత్యేకతను సంతరించుకున్నారు. విజేతలకు ప్రత్యేకంగా బహుమతులు అందజేయగా, పాల్గొన్న ప్రతి పార్టిసిపెంట్‌కీ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని కోమల్ సెలార్కా, ఆమె పార్టనర్స్ అయిన భాగ్యశ్రీ చందన్ మరియు వాణి ద్వివేది నిర్వహించారు. దర్పన్ త్రివేది, సైద్ సఫ్దార్ రజా సహాయ సహకారాలు అందించారు. ఇదే తరహాలో మరో డాన్స్ ఈవెంట్ త్వరలో నిర్వహించనున్నారు.








తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







