రెస్టారెంట్‌పై మహిళ ఫిర్యాదు: చర్యలకు ఆదేశించిన రూలర్‌

- June 21, 2018 , by Maagulf
రెస్టారెంట్‌పై మహిళ ఫిర్యాదు: చర్యలకు ఆదేశించిన రూలర్‌

షార్జా:షార్జా రూలర్‌, మెంబర్‌ ఆఫ్‌ సుప్రీమ్‌ కౌన్సిల్‌ డాక్టర్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి, ఓ మహిళ రెస్టారెంట్‌పై చేసిన ఫిర్యాదుపై స్పందించారు. ఓ రెస్టారెంట్‌ నుంచి వస్తున్న శబ్దాల కారణంగా తమ జీవనానికి ఇబ్బందికరంగా మారిందని ఆ మహిళ ఫిర్యాదు చేయగా, షేక్‌ సుల్తాన్‌ స్పందించి, తగిన చర్యలు ఈసుకోవాల్సిందిగా సంబంధిత అధికార వర్గాలను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే షార్జా మునిసిపాలిటీ, సంబంధిత రెస్టారెంట్‌ యజమానిని పిలిచి, శబ్ద తీవ్రత తగ్గేలా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com