యూఏఈ ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌కి గ్రేస్‌ పీరియడ్‌

- June 21, 2018 , by Maagulf
యూఏఈ ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌కి గ్రేస్‌ పీరియడ్‌

యూఏఈ:యూఏఈలో ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌కి ఆగస్ట్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు గ్రేస్‌ పీరియడ్‌ని ప్రకటించడం జరిగింది. ఈ కాలంలో ఇల్లీగల్‌ రెసిడెన్సీ సమస్యను ఆయా వ్యక్తులు పరిష్కరించుకోవాల్సి వుంటుంది. ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిజన్‌షిప్‌, 'ప్రొటెక్ట్‌ యువర్‌సెల్ఫ్‌ బై మాడిఫైయింగ్‌ యువర్‌ స్టేటస్‌' అనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గ్రేస్‌ పీరియడ్‌ కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ఈ కాలంలో ఆయా వ్యక్తులు తమ రెసిడెన్సీ సమస్యల్ని పరిష్కరించుకోవాల్సి వుంటుంది. గ్రేస్‌ పీరియడ్‌ దాటినా ఇల్లీగల్‌ స్టేటస్‌ సమస్యని పరిష్కరించుకోనివారిపై చర్యలు తప్పవు. యూఏఈలో సోషల్‌ మరియు ఎకనమిక్‌ స్టెబిలిటీ కోసం ఎదురుచూస్తున్నవారికోసం ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com