ఈనెల 28 నుంచి అమరనాథ్ యాత్ర!
- June 23, 2018
హిందువుల పవిత్ర అమరనాథ్ యాత్ర ఈనెల 28 నుంచి ప్రారంభంకానుంది. 60రోజుల పాటు కొనసాగనున్న యాత్ర.. ఆగస్ట్ 26న ముగుస్తుంది. దాదాపు ఆరు లక్షల మంది భక్తలు మంచు లింగాన్ని దర్శించుకోనున్నారు. కాశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో ఈ సారి యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. యాత్ర అడుగడుగునా భారీగా బలగాలను మోహరించాయి.
అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు భద్రతా దళాలు గస్తీని ముమ్మరం చేశాయి. అనంతనాగ్ సమీపంలోని అమర్నాథ్ యాత్ర మార్గంలో IJKS ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చిన నేపథ్యంలో ప్రతీకార దాడులకు తెగబడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో భక్తులకు పూర్తి భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. బేస్ క్యాంపుల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు ట్రాకింగ్ చిప్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో వారు ఎటు వెళ్తున్నారన్న విషయంపై భద్రతా దళాలు ఫోకస్ పెట్టనున్నాయి. గతంలో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ దఫా అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
అమర్నాథ్ యాత్ర కోసం బల్టాల్, పహల్గాం రూట్లలో NSG కమాండోలను కేంద్రం తొలిసారి మోహరిస్తోంది. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా ధీటుగా ఎదుర్కొనేందుకైనా సిద్ధమైంది. ఎక్కడికైనా నిమిషాల్లో చేరుకునేందుకు వీలుగా శ్రీనగర్ ఎయిర్ పోర్టులోనే కమాండోల కోసం బేస్ క్యాంప్ ను ఏర్పాటు చేసింది.

తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..