దుబాయ్‌లో ఫ్రీలాన్స్ పర్మిట్ 7,500 దిర్హామ్‌లకే
- June 26, 2018
దుబాయ్ హోల్డింగ్ మెంబర్ టెకామ్ గ్రూప్, దుబాయ్ క్రియేటివ్ క్లస్టర్ అథారిటీ (డిసిసిఎ)తో కలిసి గో ఫ్రీలాన్స్ అనే కొత్త ప్రోడక్ట్‌ని డెవలప్ చేసింది. ఫ్రీలాన్స్ టాలెంట్‌ని ఎట్రాక్ట్ చేయడమే ఈ 'లాంఛ్' ఉద్దేశ్యం. మీడియా, ఎడ్యుకేషన్ సెక్టార్‌కి సంబంధించి యూఏఈ వ్యాప్తంగా ఈ ప్రోడక్ట్‌ని అమల్లోకి తెస్తున్నారు. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ డైరెక్టివ్ - ఇన్నోవేషన్ అండ్ టాలెంట్ హబ్‌కి మద్దతుగా గో ఫ్రీలాన్స్ని తీసుకొస్తున్నారు. వినియోగదారుల అవసరాలు, మార్కెట్ రిక్వైర్మెంట్స్ నేపథ్యంలో గో ఫ్రీలాన్స్ని అభివృద్ధి చేశారు. దుబాయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా కాన్ఫరెన్స్ వేదికగా గో ఫ్రీలాన్స్ని లాంఛ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ అడ్వయిజర్, ఎగ్జిక్యూటివ్ కోచింగ్, ఫిలిం డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్స్, క్రియేటివ్ డిజైనర్స్ సహా పలు విభాగాలకు ఈ గో ఫ్రీలాన్స్ స్వాగతం పలుకుతోంది. వార్షిక రుసుము 7,500 దిర్హామ్‌లకే ఇది అందుబాటులో వుంటుంది. గోఫ్రీలాన్స్ వెబ్సైట్లో ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక







