మసాజ్ పార్లర్ వద్ద ఐదుగురి హత్య
- June 26, 2018
అబుదాబీలోని ఓ మసాజ్ పార్లర్ వద్ద ఓ వ్యక్తి ఐదుగుర్ని హత్య చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతోనే ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడు, ఆ తర్వాత పార్లర్ వద్ద వున్న మరో నలుగురు మహిళల్నీ హత్య చేశాడు. ముసాఫ్ఫా ఇండస్ట్రియల్ ఏరియా వద్ద ఈ పార్లర్ వుంది. ప్రాస్టిట్యూషన్ డెన్‌గా ఈ పార్లర్ పేరొందింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అబుదాబీ క్రిమినల్ కోర్టులో జరిగిన విచారణలో బంగ్లాదేశీ వ్యక్తి, కిచెన్ నైఫ్‌తో ఈ హత్యలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఆసియాకి చెందిన వ్యక్తి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడి ప్రియురాల్ని ఇండోనేసియన్గా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలిసిన నిందితుడి స్నేహితులు, నిందితుడ్ని కాపాడే క్రమంలో ఘటనను దాచిపెట్టారు. అయితే, కొందరు వ్యక్తులు మృతదేహాల్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని, అతని గర్ల్ఫ్రెండ్నీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు, నేరాన్ని అంగీకరించాడు. తదుపరి విచారణ సెప్టెంబర్ 26కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







