వందలాది భారతీయ కుటుంబాలకు ఉపశమనం
- June 28, 2018
యూఏఈలో క్షమాభిక్ష కోసం వందలాది భారతీయ కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఆగస్ట్ 1 నుంచి మూడు నెలలపాటు ఈ క్షమాభిక్ష అమల్లో వుంటుంది. ఈ సమయంలో తమ రెసిడెన్సీ స్టేటస్‌ని సరిచేసుకోవడం, ఇతరత్రా ఉల్లంఘనలకు సంబంధించి సమస్యల్ని పరిష్కరించుకోవడం వీలవుతుంది. ఈ నేపథ్యంలోనే యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ గ్రూప్స్, సోషల్ వర్కర్స్ సంసిద్ధమవుతున్నారు. అవసరమైనవారిని గుర్తించి, వారికి తమవంతు సహాయం అందించేందుకు కమ్యూనిటీ గ్రూప్స్, సోషల్ వర్కర్స్ తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దుబాయ్‌లోని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (కెఎంసిసి) ఆదివారం హెల్ప్ డెస్క్‌ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ డెస్క్‌కి పలు అప్లికేషన్లు అందాయని ప్రెసిడెంట్ కె. అన్వర్ నహా చెప్పారు. ప్రతిరోజూ ఐదు నుంచి ఆరు అప్లికేషన్లు వస్తున్యానీ, అందులో రెండు లేదా మూడు కుటుంబాలు వుంటున్నాయి. ఇండియన్ అసోసియేషన్ షార్జా వలంటీర్ ఒకరు మాట్లాడుతూ, గత ఏడాది సుమారుగా 120 అప్లికేషన్లను అందుకున్నామనీ, ఆ 120 కుటుంబాలూ పలు కారణాలతో అక్రమంగా యూఏఈలో నివసిస్తున్నాయని చెప్పారు. ప్రైవేటు మనీ లాండర్స్ వద్ద పాస్‌పోర్టులు ఇరుక్కుపోవడమే చాలామంది సమస్య అని చెప్పారాయన. క్షమాభిక్ష గోల్డెన్ ఛాన్స్ లాంటిదని వలంటీర్లు వివరిస్తున్నారు. అయితే దుబాయ్‌లో ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ షా మాత్రం, పెద్ద సంఖ్యలో కుటుంబాలతో సహా భారతీయులు యూఏఈలో ఇబ్బందులు పడుతున్నట్లు ఏ సంఘమూ తమ దృష్టికి తీసుకురాలేదని చెప్పారు. అమ్నెస్టీ ప్రకటించిన వెంటనే, తగిన ఏర్పాట్లు చేసి సమస్యల్లో వున్నవారికి సహాయ సహకారాలు అందించేందుకు ఇటు కాన్సూల్, అటు కమ్యూనిటీ సంఘాలు సిద్ధమవుతున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







