హైదరాబాద్‌కు దొంగల భయం. దూరంలో కారు ఆపి..
- July 01, 2018
నగరంలోకి ఢిల్లీ దొంగల ముఠా దిగింది. వీళ్లు పగలు రెక్కీ.. రాత్రి చోరీ చేసే బాపతు కాదు.. పట్టపగలే కాలనీల్లో తిరుగుతూ.. తాళం కనిపిస్తే పగలగొట్టి ఇంట్లోకి చొరబడుతారు. దోచుకున్న సొత్తును రాష్ట్ర సరిహద్దు దాటించేస్తారు. గత నెల 25 నుంచి కేవలం మూడు రోజుల్లో ఈ గ్యాంగ్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఎనిమిది ఇండ్లకు కన్నం వేసినట్టు తెలుస్తున్నది. దీంతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరిపి వీరు తిరిగే కారును గుర్తించారు. ఆ కారుపై ఇప్పటివరకు ఆరు నంబర్‌ప్లేట్లు మార్చినట్టు గుర్తించారు. ఇందులో నాలుగు తెలుగు రాష్ట్రాలవి కాగా, మరో రెండు రాజస్థాన్‌వి. ఈ ముఠా రాష్ట్రం దాటినట్టు భావిస్తున్నారు. ప్రత్యేక బృందాలు ముఠా కోసం గాలిస్తున్నాయి.
మూడు నిమిషాల్లోనే..
ముఠా సభ్యులు కారులో నగరశివారుకాలనీల్లో తిరుగుతూ ఉంటారు. కొంత దూరంలో కారు ఆపి.. టార్గెట్ చేసిన ఇంటి వద్దకు నడుచుకుంటూ వెళ్తారు. ఈ ముఠాలో ఐదుగురు సభ్యులు ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా స్టైల్ గా తయారవుతారు. ఇం దులో కొందరు మెడలో బ్యాగ్ వేసుకుంటారు. అందులోనే చిన్న రాడ్ పెట్టుకుంటారు. ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకున్న తర్వాత గేట్ దూకి లోపలికి వెళ్తారు. కొందరు బయ ట ఉండి పర్యవేక్షిస్తుండగా, మరికొందరు ఇంటిలోపలికి వెళ్లి బంగారం, వెండి, నగదును దొంగిలిస్తారు.
వీరు ఎక్కడా మూడు నిమిషాలకు మించి ఉండలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. చోరీ తర్వాత గూగుల్ మ్యాప్స్ సాయంతో నగరంలోకి ప్రవేశించి హైవేల మీదుగా తప్పించుకుంటున్నారు. ఒక చోట దొంగతనం చేసిన తర్వాత వెంటనే కారు నంబర్‌ప్లేట్ మార్చి తిరుగుతున్నారు. పోలీసులు అష్టకష్టాలు పడి రాజస్థాన్‌కు చెందిన ఓ నంబర్‌ప్లేట్ గురించి ఆరా తీయగా ఫేక్ అని తేలింది. దీంతో నంబర్‌ప్లేట్లను వదిలి మిగ తా అంశాలపై దృష్టి పెట్టారు. రెండేండ్ల కిందట హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్ జిల్లాలో ఇదే తరహా చోరీలు జరిగినట్టు గుర్తించారు. ఢిల్లీకి చెందిన 30 మంది దొంగల ముఠా నగరంలోకి ప్రవేశించి, ఐదుగురు చొప్పున విడిపోయి చోరీలకు పాల్పడినట్టు అప్పట్లో పోలీసులు గుర్తించారు. గతంలో కామారెడ్డి పోలీసులు ఈ గ్యాంగ్‌లో ముగ్గురిని అరెస్టు చేశారని సమాచారం. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇయర్‌ఫోన్ గ్యాంగ్, ఇతర అంతర్రాష్ట్ర ముఠాలపైనా పోలీసులు దృష్టి పెట్టారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







