సైన్యం అమ్ముల పొదిలోకి చేరనున్న అగ్ని-5
- July 01, 2018
అతి త్వరలో భారత సైన్యం అమ్ముల పొదిలోకి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని- 5 చేరనున్నది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న అగ్ని 5 క్షిపణి పరిధిలోకి పొరుగు దేశం చైనాలోని అన్ని ప్రాంతాలు రానున్నాయని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. శత్రుదేశాలకు చెందిన 5000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఢీకొట్టే సామర్థ్యంగల అగ్ని 5 అణ్వస్ర్తాలనూ మోసుకెళ్లగలదు. అగ్ని క్షిపణిని త్వరలోనే సైన్యానికి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్సీ)కు అందచేయనున్నట్లు అధికార వర్గాల కథనం. ఎస్ఎఫ్సీకి అందజేయడానికి ముందు మరికొన్ని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. చైనా రాజధాని బీజింగ్తోపాటు ఆ దేశంలోని షాంఘై, గ్వాంగ్జ్జు, హాంకాంగ్ తదితర నగరాల్లో లక్ష్యాలనూ ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉంది. గత నెలలో ఒడిశా తీరంలో అగ్ని 5 క్షిపణి ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న సమయంలో అగ్ని క్షిపణిని సైన్యం అమ్ముల పొదిలో చేరుస్తుండటం గమనార్హం.
అమెరికాతోపాటు చైనా, రష్యా, ఫ్రాన్స్, ఉత్తరకొరియా వద్ద మాత్రమే ఇప్పటి వరకు ఖండాంతర క్షిపణులున్నాయి. తాజాగా భారత్ ఆ జాబితాలో చేరింది. తొలుత 700 కి.మీ లక్ష్యంతో కూడిన అగ్ని 1 క్షిపణిని అభివృద్ధి చేసిన భారత్ తదుపరి 2000 కి.మీ శ్రేణితో కూడిన అగ్ని -2, అగ్ని 3ని తయారుచేసింది. 2,500 కి.మీ నుంచి 3,500 కిమీకి పైగా దూరంలో లక్ష్యాన్ని ఢీకొట్టగల అగ్ని -4ను అభివృద్ధి చేసింది. 2012 ఏప్రిల్ 19న అగ్ని 5 క్షిపణిని తొలుత ప్రయోగాత్మకంగా పరీక్షించారు. రెండోసారి 2013 సెప్టెంబర్ 15న, మూడోసారి 2015 జనవరి 31న, నాలుగోసారి 2016 డిసెంబర్ 26న పరీక్షించారు. ఐదోసారి గత జనవరి 18న జరిపారు. ఇప్పటివరకు ఐదుసార్లు ప్రయోగాత్మక పరీక్షలను అగ్ని క్షిపణి విజయవంతంగా పూర్తి చేసుకున్నది. గత నెలలోనూ విజయవంతంగా మరోసారి పరీక్షించిన అగ్ని 5 క్షిపణి.. అగ్ని శ్రేణి క్షిపణుల్లో అధునాతనమైంది.
కొత్తగా అభివృద్ధి చేసిన శాస్త్ర పరిజ్ఞానాన్ని అగ్ని - 5లో ఉపయోగించారు. ఇందులో అమర్చిన ఇంజిన్, దిక్సూచి, వార్ హెడ్ కూడా కొత్తవే. అగ్ని 5 క్షిపణిలో అత్యంత వేగంగా పని చేసే కంప్యూటర్.. లోపాలకు తావులేని సాఫ్ట్వేర్, పూర్తిస్థాయి డిజిటల్ నియంత్రణ తదితర వ్యవస్థలు ఉన్నాయి. సుఖోయి యుద్ధ విమానాల నుంచి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించేందుకు కృషి చేస్తున్నది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించడానికి వీలుగా సుఖోయ్ జెట్ యుద్ధ విమానాలకు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థాగత మార్పులు చేస్తున్నది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..