యు.ఏ.ఈ :పేరెంట్స్‌కి రెసిడెన్సీ వీసా పొందడమెలాగంటే..
- July 02, 2018
యూఏఈలో ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడే చాలామందికి ఎదురయ్యే సమస్య, వారి కుటుంబాల్ని స్వదేశంలో వదిలి రావడం. యూఏఈలో ఎక్స్పెన్సెస్ ఎక్కువ కావడంతో, ఆ సమస్య నుంచి బయటపడేందుకు తమ కుటుంబ సభ్యుల్ని స్వదేశంలో వదిలి వస్తుంటారు చాలామంది. తమ తల్లిదండ్రులు, ఇన్-లాస్‌ని స్పాన్సర్ చేయాలంటూ యూఏఈలో వలసదారులు ఖచ్చితంగా 19,000 దిర్హామ్‌ల మినిమమ్ సేలరీ (అకామడేషన్‌తో కలిపి) పొందాల్సి వుంటుంది. అకామడేషన్ లేకుండా 20,000 దిర్హామ్‌ల సేలరీ వుండాలి. ఇవేవీ లేని పక్షంలో డిఎన్ఆర్డిలోని హ్యుమానిటేరియన్ని సంప్రదించాల్సి వుంటుంది. దీనికిగాను, స్వదేశంలో తన తల్లిదండ్రుల్ని చూసుకునేందుకు ఎవరూ లేరని ధృవీకరణ పొందాలి. 600 దిర్హామ్‌ల మినిమమ్ మెడికల్ ఇన్స్యూరెన్స్ పాలసీని పొందాల్సి వుంటుంది. డెవా బిల్, టెనెన్సీ కాంట్రాక్ట్, హౌస్‌లో తగినంత స్థలం వుందనే ధృవీకరణ తప్పనిసరి. అకామడేషన్ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయి వుండాల్సిందే.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







