ప్రముఖ దర్శక నిర్మాత మృతి
- July 02, 2018
ప్రముఖ సినీ దర్శక నిర్మాత ఆర్. త్యాగరాజన్ చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. 74 సం.ల వయసున్న ఆయన పలు తమిళ, హిందీ, తెలుగు భాషల్లో దాదాపు 35 చిత్రాలను తెరకెక్కించారు. రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి అగ్రనటులతో కూడా ఆయన చిత్రాలు నిర్మించారు. ఎంజీఆర్ హీరోగా పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. రజనీకాంత్, రాజేష్ ఖన్నాలతో రెండు హిందీ చిత్రాలు నిర్మించారు. ఆట్టుక్కార అలమేలు అనే తమిళ చిత్రాన్ని తెలుగులో పొట్టేలు పున్నమ్మ పేరుతో రీమేక్ చేశారు. ఈయనకు భార్య సుబ్బలక్ష్మి, కొడుకు వేల్ మురుగన్, కూతురు షణ్ముగవడివు ఉన్నారు. త్యాగరాజన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేసారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..