బెంగుళూరు:కుప్పకూలిన భవనం..
- July 02, 2018
భూకంపం రాలేదు.. బాంబులు పేలలేదు.. అంతా ప్రశాంతంగా ఉంది.. కానీ.. ఓ ఇల్లు మాత్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అర్థరాత్రి జరిగిన ఈ సంఘటన అందర్నీ భయకంపితులను చేసింది. బాంబులు పడ్డట్లు శబ్ధం రావడంతో ఇరుగు పొరుగు బయటకు వచ్చి చూసే సరికి.. కుప్పకూలిన ఇల్లు కనిపించింది.
బెంగళూరులోని ఆస్టిన్ టౌన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో అద్దెకు ఉంటున్న భార్యా భర్తలు నిద్రిస్తున్నారు. భవన శిధిలాల కింద కూరుకుపోయిన వారిద్దర్నీ స్థానికులు రక్షించారు. అదృష్ట వశాత్తూ వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రగాయాల పాలైన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఆస్టిన్ టౌన్‌లో ఉన్న ఈ రెండంతస్తుల భవనాన్ని కట్టి దాదాపు 40 ఏళ్లవుతోంది. దీన్ని ఇటీవలే రాజు కొనుగోలు చేశాడు. దీన్ని అద్దెకు ఇచ్చాడు. ఇల్లు కూలిపోవడంతో రాజుపై కేసు నమేదు చేసి.. అరెస్ట్ చేశారు. అసలు భవనం ఎందుకు కూలిపోయిందన్నదానిపై మున్సిపల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్