హిందూ మీల్‌పై ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ యూటర్న్..
- July 04, 2018
దుబాయ్ : దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తన విమానాల్లో హిందూ మీల్‌ను నిలిపివేయనున్నట్టు ప్రకటించిన కొద్ది గంటల్లోనే యూటర్న్ తీసుకుంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా హిందూ భోజనాన్ని మెనూలో కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. హిందూ వినియోగదారుల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ ఆప్షన్‌ను తాము కొనసాగించాలని నిర్ణయించినట్టు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
తమ ఉత్పత్తులు, సేవల సమీక్షలో భాగంగా హిందూ మీల్ ఆప్షన్‌ను నిలిపివేస్తున్నట్టు మంగళవారం ఎమిరేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ మేరకు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని హిందూ ప్రయాణీకులు ఇక శాకాహార, మాంసాహార వంటకాలను హిందూ మీల్లో భాగంగా ఎంచుకోవచ్చని సంస్థ పేర్కొంది. శాకాహార ప్రయాణీకులు జైన్ మీల్, ఇండియన్ వెజిటేరియన్ మీల్, కోషల్ మీల్, నాన్ బీఫ్, నాన్ వెజిటేరియన్ ఆప్షన్లనూ ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. శాకాహారుల కోసం ఇండియన్ వెజిటేరియన్ మీల్‌ను అందిస్తుందని ఎయిర్‌లైన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







