మానస సరోవర్‌లో ఇంకా డేంజర్‌గానే వెదర్.. 200 మంది భారత యాత్రికులు..

- July 04, 2018 , by Maagulf
మానస సరోవర్‌లో ఇంకా డేంజర్‌గానే వెదర్.. 200 మంది భారత యాత్రికులు..

మానస సరోవర్ యాత్రకు వెళ్లి చిక్కుకొన్నవారికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండచరియలు విరిగిపడి, అనారోగ్యం కారణంగా ఐదుగురు యాత్రికులు మృత్యువాత పడ్డారు. మృత్యువాత పడిన వారిలో ఇద్దరు తెలుగువారు ఉన్నారు.

కైలాస మానస సరోవరం యాత్రలో చిక్కుకున్న వారిలో సహాయక బృందాలు హిల్సా నుంచి సిమికోట్ 200 మంది భారత యాత్రికులను తరలించాయి. 119 మంది యాత్రికులను సహాయక బృందాలు సిమికోట్ నుంచి సుర్ఖేత్‌కు తరలించాయి. యాత్రికులను సుర్జేత్ నుంచి నేపాల్‌గంజ్‌కు తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేసినట్లు నేపాల్‌లో భారత రాయబార కార్యాలయం తెలిపింది. నేపాల్‌గంజ్, సిమికోట్, హిల్సా ప్రాంతాల్లో పరిస్థితిని రాయబార కార్యాలయం అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం 5  విమానాలు, నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లు యాత్రికులను సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

భారత్‌కు చెందిన మానససరోవర్ యాత్రికుల్లో 525 మంది నేపాల్‌లోని సిమికోట్‌లో, మరికొంత మంది హిల్సాలో, టిబెట్‌లో చిక్కుకుపోయినట్లుగా భారత విదేశాంగ మంత్రి తెలిపింది. వీరిలో సుమారు 100 మంది తెలుగువారు ఉన్నట్లు తెలుస్తోంది. సహాయ చర్యల కోసం సైన్యాన్ని పంపించాలని విదేశాంగశాఖను  ఏపీ భవన్ రెసిడెంట్  అధికారులు కోరారు. తెలుగువారందరినీ సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

మానససరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికులకు వాతావరణం అనుకూలించని కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యాత్రికులు వేలాది మంది సహాయక శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. అయితే కొండచరియలు విరిగిపడిన కారణంగా ముగ్గురు  అనారోగ్యం, గుండెపోటుతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.మృతుల్లో ఇద్దరు తెలుగువారు ఉన్నారు. పర్వతప్రాంతాల్లోనే ఉన్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com