వణికిపోతున్న ముంబై నగరం...
- July 08, 2018
ముంబై మహా నగరం వణికిపోతోంది. గత ఐదు రోజుల నుంచి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.. రవణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. చాలాచోట్ల రోడ్డుపైన సైతం ఇదాల్సిన పరిస్థితి కనిపిస్తోంది..
మరోవైపు ముంబైలో, కొంకణ్, గోవాలోనూ రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే భారీ వర్షాలతో ముంబై తడిసి ముద్దయింది. థానే, నవీ ముంబయి, మలాద్, బొరివలి, పొవరు, భండూప్, బదల్పూర్, కళ్యాణ్ తదితర ప్రాంతాలలోని రహదారులన్నీ నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా ఉత్హా నది ప్రవాహ స్థాయి పెరిగింది. దాని సమీప ప్రాంతాలైన కళ్యాణ్, మిలాప్, నగర్, డాంబివిలిలో వరద పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల దృష్ట్యా విపత్తు నిర్వహణ సిబ్బంది అలర్ట్గా ఉన్నారు. రానున్న 24 గంటల్లో నాగపూర్లో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అధికారులు చెప్పారు.
ముంబై రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘట్కోపర్లో విద్యుద్ఘాతంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వర్షాల ప్రభావంతో పట్టాలపై నీళ్లు నిలిచిపోవడంతో ముంబైలో లోకల్ ట్రైన్లు 15 నుంచి 20 నిమిషాలపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు వచ్చే మూడు రోజులపాటు ముంబైలో, శివారు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







